రూ. 400 కోట్లకు'వెన్నపూశారు'
డొల్ల కంపెనీల పేరుతో నకిలీపత్రాలు సృష్టించి 400 కోట్ల రూపాయల దోచేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖజిల్లాలో డొల్ల కంపెనీల పేరుతో రూ.400 కోట్ల టర్నోవర్ జరిపినట్లు నకిలీపత్రాలు సృష్టించి, ప్రభుత్వాన్ని మోసం చేసిన వెన్నపూస సుబ్బారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. 70 కంపెనీలు సృష్టించి రూ.60 కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వినియోగం చేశారు. గుంటూరు, భీమవరంలో జీఎస్టీ నిఘా అధికారుల తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. డొల్ల కంపెనీలకు చెందిన 30 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా 21 కంపెనీల ద్వారా రూ.400 కోట్ల లావాదేవీలు జరిపినట్లు , తెలుగు రాష్ట్రాల్లో డొల్ల కంపెనీల పేరుతో పత్రాలు సృష్టించినట్లు నిర్ధరణ చేశారు. సుబ్బారెడ్డికి ఈనెల 26 వరకు రిమాండ్‌ను విశాఖ న్యాయస్థానం విధించింది.మిగిలిన కంపెనీల వ్యవహారాలపై జీఎస్టీ అధికారులు కూపీ లాగుతున్నారు.