ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అయ్యో! డిస్నీల్యాండ్‌.. చూస్తుంటే, గుండె తరుక్కుపోతోంది!

థ్రిల్లింగ్ రైడ్స్‌, జల క్రీడలు, ఆక్వా డ్యాన్స్, వేవ్ పూల్స్, పచ్చని వాతావరణంలో పక్షుల కిలకిలరావాలు.. ఇలా భూతల స్వర్గాన్ని తలపించే ఆ సుందర దృశ్యాలు ఊహించుకుంటేనే ఎంతో బాగుంది కదూ. బంధు, మిత్రులతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయటానికి ఇంతకన్నా మంచి ప్రదేశం ఏముంటుంది ? గతమెంతో ఘనమంటూ నాలుగేళ్ల క్రితం వరకు అక్కడ అలా సందడి వాతావరణం కనిపించేది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

By

Published : Sep 10, 2022, 9:46 AM IST

Updated : Sep 10, 2022, 11:45 AM IST

Disneyland in Vijayawada
డిస్నీల్యాండ్‌

ఆనందంతో కేరితంలు కొడుతూ... జలక్రీడల్లో మైమరిచిపోతున్న జనం ఒకవైపు, పిచ్చిమొక్కలు, తుప్పుపట్టిన క్రీడాపరికరాలు, కాలు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు మరోవైపు... మీరు చూస్తున్న రెండు ప్రాంతాలు వేర్వేరు కాదండోయ్‌, రెండూ ఒకటే అదే విజయవాడ నడిబోడ్డున ఉన్న సింగ్‌నగర్‌లోని డిస్నీల్యాండ్‌. 4 ఏళ్ల క్రితం వరకు నగరవాసులను అలరించిన డిస్నీల్యాండ్‌ ఇప్పుడు ఎలా ఉందో చూడండి.

1999లో విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో డిస్నీల్యాండ్ ఏర్పాటు

నగరవాసులకు ఆనందం, ఆహ్లాదం పంచేందుకు 1999లో విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ... సింగ్ నగర్‌లో 57 ఎకరాల స్థలంలో డిస్నీల్యాండ్ ఏర్పాటు చేశారు. చుట్టూ పచ్చని మొక్కలు, పక్షులతో ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, సాహస క్రీడలు ఉండేవి. విజయవాడతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండేది. డిస్నీల్యాండ్‌ను 20 ఏళ్లపాటు సిబార్ సంస్థకు లీజుకు ఇచ్చారు. 4 ఏళ్లక్రితం లీజుగడువు ముగిసిన నాటి నుంచి కార్పొరేషన్ అధికారులు డిస్నీల్యాండ్‌ను పట్టించుకోవడం లేదు. లీజు గడువు పొడిగించకపోవడంతోపాటు....కొత్త టెండర్లు పిలవకుండా కాలయాపన చేస్తున్నారు. నిర్వహణలోపంతో డిస్నీల్యాండ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

అధికారుల నిర్లక్ష్యం వల్ల డిస్నీల్యాండ్‌లో పిచ్చి మెక్కలు

అధికారుల నిర్లక్ష్యం వల్ల డిస్నీల్యాండ్‌లో పిచ్చి మెక్కలు, ముళ్ల కంపలు పెరిగిపోయి అడవిని తలపిస్తోంది. పర్యవేక్షణ లేక ఆట వస్తువులు తుప్పు పట్టాయి. వాటర్ వరల్డ్‌లో నీరు మురికి కూపంగా మారింది. ఆకతాయిలు ఈ ప్రాంతాన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఖాళీగా ఉంచడం వల్ల ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం డిస్నీ ల్యాండ్‌ను ఎందుకు గాలికివదిలేసిందని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతు‌న్నారు.

విజయవాడ డిస్నీల్యాండ్‌

ఇవీ చదవండి:

Last Updated : Sep 10, 2022, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details