శాసనసభ సమావేశాల్లో పింఛన్ల అంశం కాక రేపింది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తున్నారా ? లేదా ? అనే ప్రశ్నకు అధికార పార్టీ నుంచి వచ్చిన సమాధానాన్ని ప్రతిపక్షం తప్పుపట్టింది. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ సంగతేంటని వైసీపీని నిలదీసింది తెలుగుదేశం. తాము పింఛన్లు ఇస్తామని చెప్పలేదని... ఏడాదికి కొంత నగదు ఇస్తామనే చెప్పామని జగన్ సభలో వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను సభలో ప్లే చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమకూ అవకాశం ఇవ్వాల్సిందేనని... తాము ఇచ్చిన వీడియోను ప్లే చేయాలని తెదేపా సభ్యులు పట్టుపట్టారు.
'45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇవ్వబోం' - tdp
పింఛన్లపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే ప్రశ్నకు అధికార పార్టీ సమాధానాన్ని ప్రతిపక్షం తప్పుపట్టింది. తాము పింఛన్లు ఇస్తామని చెప్పలేదని వైకాపా స్పష్టం చేసింది.
సీఎం జగన్