ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిప్లొమాటిక్ అవుట్‌రీచ్‌...పెట్టుబడులకు ఆహ్వానం

విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ అవుట్‌రీచ్‌ సదస్సు ద్వారా... పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. నవ్యాంధ్రలో ఉన్న వనరులు, సానుకూలతలపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని ప్రతినిధులకు ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి విజ్ఞప్తిచేశారు.

By

Published : Aug 10, 2019, 6:04 AM IST

డిప్లొమాటిక్ అవుట్‌రీచ్‌...పెట్టుబడులకు ఆహ్వానం

డిప్లొమాటిక్ అవుట్‌రీచ్‌...పెట్టుబడులకు ఆహ్వానం

విజయవాడలో డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సు నిర్వహించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అవకాశాలను విదేశీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.
పెట్టుబడులతో రండి...సహకారం అందిస్తాం...
సుదీర్ఘ తీర ప్రాంతం, మానవ వనరులు, సులభరత పెట్టుబడుల విధానం లాంటి అంశాలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. పరిశ్రమలకు ఏంకావాలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు

అప్లికేషన్ పెట్టండి... మేం చూసుకుంటాం...
సదస్సులో ప్రజెంటేషన్లు పూర్తైన అనంతరం... 14 దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. దక్షిణకొరియా, సింగపూర్, పోలాండ్, బల్గేరియా, ఆస్ట్రియా, తుర్గ్‌మెనిస్తాన్, కీర్గ్ రిపబ్లిక్, బోట్స్‌వాన, శ్రీలంక, యూకే, మయన్మార్, డెన్మార్క్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా రాయబారులతో సీఎం చర్చించారు. ఒక్క అప్లికేషన్ పెడితే అనుమతుల విషయం పూర్తిగా సీఎం కార్యాలయమే చూసుకుంటుందని చెప్పారు.
మా ప్రత్యేకతలు ఇవే....
వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, కాన్సులేట్ జనరల్స్‌తో... పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమావేశమయ్యారు. ఫార్మా, ఆటోమొబైల్‌, ఉక్కు, టెక్స్‌టైల్స్‌, ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్‌, బొగ్గు గనులు, నైపుణ్య శిక్షణ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. బెంగళూరు అంటే ఎలక్ట్రానిక్స్, చెన్నై అంటే ఐటీ తరహాలో... ఏపీ ప్రాధాన్యం ఏంటని విదేశీ ప్రతినిధులు అడగ్గా... తీర ప్రాంతం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రవాణా సౌకర్యాలు, నీరు, విద్యుత్ పుష్కలంగా ఉన్నట్లు వివరించారు.
స్థానిక కోటాతో ఎలాంటి ఇబ్బంది ఉండదు....
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామంటూ చట్టం చేయడంపై ఆస్ట్రియా, కిర్గిస్థాన్ ప్రతినిధులు స్పష్టత కోరగా... స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెంచడంలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని... అందువల్ల స్థానికులకు ఉద్యోగాల కోటాతో పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు.
ఆసక్తి కనబర్చిన పలు దేశాలు....
బొగ్గు గనుల రంగంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు ఇండోనేషియా ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. అలాగే పోస్కో ప్లాంటు ఏర్పాటుకు దక్షిణకొరియా ముందుకొచ్చింది. థర్మల్‌, సౌర, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు సింగపూర్‌ ఆసక్తి వెలిబుచ్చింది. విద్యుత్ వాహనాల తయారీకి బ్రిటన్‌ సంసిద్ధత వ్యక్తంచేయగా... ఎగుమతులకు సాయం చేస్తామని బల్గేరియా తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details