ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DIG Palaraju as Vijayawada incharge CP: విజయవాడ ఇంఛార్జి సీపీగా డీఐజీ పాలరాజు - విజయవాడ ఇంఛార్జి సీపీగా డీఐజీ పాలరాజు

విజయవాడ ఇంఛార్జి సీపీగా.. డీఐజీ పాలరాజు (DIG Palaraju as Vijayawada incharge CP)ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పాలరాజు ప్రస్తుతం టెక్నికల్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఆదేశాలతో మంగళవారం ఇంఛార్జి సీపీగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సీపీగా పనిచేస్తున్న బి.శ్రీనివాసులు ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు.

DIG Palaraju as Vijayawada incharge CP
విజయవాడ ఇంఛార్జి సీపీగా డీఐజీ పాలరాజు

By

Published : Nov 29, 2021, 10:51 PM IST

విజయవాడ ఇంఛార్జి సీపీగా.. డీఐజీ పాలరాజు (DIG Palaraju as Vijayawada incharge CP) ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీపీగా పనిచేస్తున్న బి.శ్రీనివాసులు ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. దీంతో.. పాలరాజుకు విజయవాడ పోలీస్ కమిషనర్​గా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీచేశారు.

పాలరాజు ప్రస్తుతం టెక్నికల్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఆదేశాలతో.. ఇంఛార్జి సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఆయన విధుల్లో చేరే అవకాశం ఉంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాలరాజు సీపీగా కొనసాగనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. టెక్నికల్ డీఐజీగా పాలరాజు రాష్ట్ర పోలీసులకు అవార్డులు తేవటంలో కృషి చేసినందుకు.. సీపీగా అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details