ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘాట్ల వద్ద అనుమతి నిరాకరణ - శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘాట్ల వద్ద అనుమతి నిరాకరణ

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘాట్ల వద్ద అనుమతిని నిరాకరించారు. దుర్గ, భవానీ, పద్మావతి ఘాట్లలో స్నానాలకు అనుమతి లేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

devi_sharannavaratri_vijayawada

By

Published : Sep 28, 2019, 1:38 PM IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని దుర్గ, భవానీ, పద్మావతి ఘాట్ల దగ్గర స్నానాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం మరో 4 రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు బ్యారేజికి వస్తుందని తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఘాట్ల వద్ద ప్రమాదకర పరిస్థితి ఉండటంతో నది లోపలికి అనుమతి లేదన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా స్నానాలకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details