నవంబరు, డిసెంబరు నెలల్లో 2.5 క్యాజువల్ సెలవులతో పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవుల్లో ఒకటి, మహిళలకు ఇచ్చే ప్రత్యేక క్యాజువల్ సెలవు మరొకటి వినియోగించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఈ లెక్కన పురుష ఉపాధ్యాయులు 3.5, మహిళ ఉపాధ్యాయులు 4.5 సెలవులను వినియోగించుకోవచ్చు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు వైద్య, క్యాజువల్, ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. సెలవులు మంజూరు చేసే అధికారులు పాఠశాలలకు 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు మొత్తం క్యాజువల్ సెలవులు 15, ప్రత్యేక క్యాజువల్ సెలవులు 7, మహిళలకు ప్రత్యేకించి క్యాజువల్ సెలవులు 5 ఉంటాయి. కొవిడ్-19 కారణంగా పాఠశాలల పున:ప్రారంభం ఆలస్యమైనందున దామాషా పద్ధతిలో సెలవుల వినియోగానికి అనుమతించారు.
ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పరిమితులు - ఉపాధ్యాయల సెలవులపై పరిమితులు న్యూస్
ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ పరిమితులు విధించింది. దామాషా పద్ధతిలో సెలవుల వినియోగానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పరిమితులు