ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేసవికి ముందే..చల్లని నేస్తాలు - విభిన్న ఆకృతుల్లో కుండలు

వేసవి రాకముందే చల్లని నేస్తాలు బెజవాడ వాసులు కోసం వచ్చేశాయి. దప్పిక తీర్చేందుకు మేమున్నామని పలకరించే మట్టి కుండలు ఇప్పుడు వివిధ ఆకృతులలో నగరవాసులను రారామ్మని ఆహ్వానిస్తున్నాయి.

వివిధ ఆకృతుల్లో మట్టి పాత్రలు

By

Published : Feb 18, 2019, 7:16 AM IST

వివిధ ఆకృతుల్లో మట్టి పాత్రలు
విజయవాడలో బందర్ రోడ్డు గుండా బస్ స్టాండ్ వైపు వెళ్లే వాళ్లంతా రామ్మోహన్ గ్రంథాలయం దగ్గరకు చేరుకోగానే టక్కున బండికి బ్రేక్ వేస్తున్నారు. అలా అని గ్రంథాలయంలోకి వెళ్లి చదువుకోవడానికి కాదండోయ్.... మట్టి కుండల కోసం. బెజవాడ వాసులను ఆకట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి బండెడు కడవలు ఎండాకాలం కంటే ముందే వచ్చేశాయి. కేవలం కుండలు మాత్రమే కాదు.. రకరకాల మట్టి పాత్రలతో ఉన్న ఆ రాజస్థానీ అంగడి చూపరులను కట్టిపడేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details