కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించేందుకు, నేటి తరం విద్యార్థులకు ప్రాచీన కళల గురించి అవగాహన కల్పించేందుకు క్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కృషి చేస్తోంది. కళాకారులతో వివిధ రకాల ఉత్పత్తులు తయారీ ప్రదర్శనను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసి, ఆసక్తిగల విద్యార్థులను ఆయా వృత్తుల్లో ప్రత్యేక శిక్షణ కల్పిస్తోంది. విజయవాడ పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో వెదురు బుట్టల తయారీ పై కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం లోని 5 ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ సుజాత తెలిపారు.
కళలతో కళకళలాడుతున్న విజయవాడ ప్రభుత్వ పాఠశాల.... - కళలో శిక్షణ
ప్రభుత్వ పాఠశాలలు నూతన విధానానికి నాంది పలుకుతున్నాయి. కొత్త కొత్త కళలతో విద్యార్థలలో నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.దీనికి ఉదాహరణ.... విజయవాడలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల...
శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినీలు