ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'భూములు అమ్ముతారా, జాయింట్ వెంచర్​లా చేస్తారా..?'

By

Published : Feb 24, 2021, 5:42 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ రద్దు కోరుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు ఉన్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయం అంటే ఏమిటని ప్రశ్నించిన ఆయన.. భూములు అమ్ముతారా, జాయింట్ వెంచర్​లా చేస్తారో చెప్పాలని కోరారు.

cpm Raghavulu comments on Cabinet decision on steel plant
రాష్ట్ర కెబినెట్ నిర్ణయంపై అనుమానాలు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వద్దు.. ప్రత్యామ్నాయాలు చూడాలన్న కేబినెట్ నిర్ణయంపై అనుమానాలున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయం అంటే ఏమిటని ప్రశ్నించిన ఆయన.. ఆ భూములు అమ్ముతారా, జాయింట్ వెంచర్​లా చేస్తారో చెప్పాలని కోరారు. భూములు అమ్మాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వాటి విలువ ఆధారంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు.

ప్రత్యామ్నాయం పేరుతో దొడ్డిదారిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించే వరకు పోరాటాన్ని కొనసాగించాలన్నారు.

ఇదీ చూడండి:నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య..మృతదేహంతో విద్యార్థుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details