తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజలాల వివాదంపై సీజేఐ... జస్టిస్ ఎన్వీ రమణ సూచన మేరకు నడచుకుంటే మంచిదని సీపీఎం నేత మధు అన్నారు. జల వివాదంలో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వహిస్తామనటం మంచి పరిణామం అన్నారు.
దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ముంపు గ్రామాల సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. రాష్ట్ర విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని.. అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి జగన్కు సూచించారు.