ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోంది' - ఏపీ తాజా వార్తలు

15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో కోత పెడుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని సీపీఎం నేత బాబూరావు ఆరోపించారు. పన్నుల భారం మోపేందుకు కేంద్రం పెడుతున్న షరతులకు వైకాపా ప్రభుత్వం లొంగిపోతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను దెబ్బతీసి అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిధుల విషయంలో కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు.

Cpm
Cpm

By

Published : Nov 10, 2020, 9:53 PM IST

15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో ఆంధ్రప్రదేశ్​కు కోత విధించడం అన్యాయమని సీపీఎం నేత బాబూరావు అన్నారు. నవంబరు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విజయవాడలో సత్యనారాయణపురంలో 4వ రోజు ప్రజా చైతన్యభేరి పాదయాత్ర నిర్వహించామన్నారు. పట్టణ వాసులపై పన్నుల భారం మోపేందుకు... కేంద్ర ప్రభుత్వం పెడుతున్న షరతులకు వైకాపా ప్రభుత్వం లొంగిపోతుందని మండిపడ్డారు.

రాష్ట్రాలను దెబ్బతీసి అధికారాలను కేంద్రీకృతం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​కు తీరని ద్రోహం చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాజధాని, పోలవరం ప్రాజెక్టు అన్ని అంశాలలో రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెంచి సాధారణ, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని బాబూరావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details