సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ - వైసీపీ
రాయలసీమలో వర్షాభావం, కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఈ విషయంపై వెంటనే స్పందించాలని కోరారు.
cpi_state_secretary_ramakrishna_letter_to_jagan
రాయలసీమలో నీటి పరిస్థితులపై సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కృష్ణా నీటిని రాయలసీమ చెరువుల్లో నింపాలని కోరారు. ఇప్పటికీ రాయలసీమలో తాగునీటిని ట్యాంకర్లతో అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాయలసీమ కరవు పరిస్థితులు మారాలంటే.. కృష్ణా నీళ్లు మళ్లించాలని సూచించారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.