ప్రతిపక్ష నేతగా అమరావతిని ఆహ్వానిస్తున్నామని చెప్పిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక అదే అమరావతిలో విధ్వంసం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో మండిపడ్డారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 600 రోజులుగా రైతులు, మహిళలు, రైతు కూలీలు సుదీర్ఘ ఉద్యమం చేస్తున్నా సీఎం.. స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఐకాస ఆధ్వర్యంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ రైతులు చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. అమరావతిపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని.. అమరావతి విషయంపై రాష్ట్ర ప్రభుత్వ తీరు సైతం మారాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలు తక్షణమే ఇవ్వాలని అన్నారు.