ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్పే లక్ష్యం... హోదా సాధనే ధ్యేయం - విభజన హామీలు

మార్పే లక్ష్యంగా.. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు ప్రధాన అంశాలుగా సీపీఐ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.

సీపీఐ మేనిఫెస్టో విడుదల

By

Published : Mar 23, 2019, 3:19 PM IST

సీపీఐ మేనిఫెస్టో విడుదల
రాష్ట్రంలో మార్పే లక్ష్యంగా.. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీలు అమలు ప్రధాన అంశాలుగా సీపీఐ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. విజయవాడ దాసరి భవన్ లో సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేనిఫెస్టో ప్రకటించారు. అవినీతి రహిత పరిపాలన, ప్రభుత్వ ఆధ్వర్వంలో విద్య వైద్య రంగాల నిర్వహణ.. లాంటి హామీలు వెల్లడించారు.రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పరిపూర్ణ విశాఖ రైల్వేజోన్‌, రామాయపట్నం పోర్టు, గిరిజన వర్సిటీ సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మారుస్తామన్న సీపీఐ నేత.. అర్హులందరికీ ఇళ్లస్థలాలు, తాగునీరు, నివాసాలకు విద్యుత్‌, మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు నెలకు 5 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తూ... ఉద్యోగ, ఉపాధి అవకాశాలుకల్పిస్తామని భరోసా కల్పించారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details