COVID IN AP: రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలు చేసిన ప్రతి వంద మందిలో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 135 మంది కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ వేరియంట్‌కు చెందినవే 50 శాతం ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతి సోమ, శుక్రవారాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి గ్రామ సచివాలయాల్లోనే బూస్టర్ డోస్ వ్యాక్సిన్లను వేస్తున్నామని అధికారులు తెలిపారు. 75 రోజుల్లో 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్‌లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్ వెల్లడించారు.
Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 21,566 మంది వైరస్ బారినపడగా.. మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 18,294 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉంది.
- మొత్తం కేసులు : 4,38,25,185
- మొత్తం మరణాలు: 5,25,870
- యాక్టివ్ కేసులు: 1,48,881
- కోలుకున్నవారి సంఖ్య: 4,31,50,434