అభివృద్ధిలో నిర్మాణ రంగానిది ప్రధాన పాత్ర అని బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కన్‌స్ట్రక్షన్ అండ్ బిల్డ్ టెక్ ఎక్స్‌పోను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణు, రామ్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో నాణ్యత, తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా....అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్ని అందించేందుకు భవన నిర్మాణదారులు సైతం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భవన నిర్మాణ దారుల సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా....నిర్మాణ రంగంలో ఉన్న పలు సమస్యలను క్రెడాయ్ సంస్థ విజయవాడ ఛాప్టర్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి... మంత్రికి వివరించారు.
'కన్స్ట్రక్షన్ అండ్ బిల్డ్ టెక్ ఎక్స్ పో ప్రారంభం'
విజయవాడలోని ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో కన్స్ట్రక్షన్ అండ్ బిల్డ్ టెక్ ఎక్స్ పో ప్రారంభమైంది. వివిధ దేశ, రాష్ట్రాలకు చెందిన నిర్మాణ సంస్థలు అందుబాటులోకి తెచ్చిన పనిముట్లు, సాంకేతికతను పరిశీలించి వాటి పనితీరు గురించి మంత్రులు బొత్స, వెల్లంపల్లి శ్రీనివాస్ లు తెలుసుకున్నారు..
'కన్స్ట్రక్షన్ అండ్ బిల్డ్ టెక్ ఎక్స్ పో ప్రారంభం'
ఇవీ చూడండి-8న పంట బీమా పథకం ప్రారంభం: మంత్రి కన్నబాబు