ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tulasi Reddy: 'సీఎం జగన్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది'

"ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు, జీతాలు సకాలంలో ఇవ్వలేని సీఎం జగన్.. మూడు రాజధానులు నిర్మిస్తాననటం విడ్డురంగా ఉంది" అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దుయ్యబట్టారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని విమర్శించారు.

Congress Tulasireddy comments On cm Jagan
సీఎం జగన్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది

By

Published : Jul 3, 2021, 10:12 PM IST

Updated : Jul 4, 2021, 2:44 AM IST

జగన్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక క్రమశిక్షణ గాడితప్పిందని ఏపీసీసీ(PCC) కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పెన్షన్లు, జీతాలు కూడా ఇవ్వలేని సీఎం జగన్(CM JAGAN).. మూడు రాజధానులు కడతాననడం విడ్డురమేనని ఎద్దేవా చేశారు.

ప్రధాన మంత్రి మాతృ వందన పథకం రాష్ట్రంలో అమలు కాకపోవడానికి ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడమే కారణమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాగా చెల్లించాల్సిన డబ్బు చెల్లించని కారణంగా గత 7 నెలలుగా మాతృ వందన పథకం (PMMVY) నిలిచిపోయిందని తెలిపారు. 2021 ఫిబ్రవరి నుంచి మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. గోకులం షెడ్లకు సంబంధించి రెండేళ్లుగా బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తులసిరెడ్డి ప్రకటన
Last Updated : Jul 4, 2021, 2:44 AM IST

ABOUT THE AUTHOR

...view details