మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్రవిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏకే వేణుగోపాల్‌రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నిర్వహించిన సభలో మంత్రి పెద్దిరెడ్డిని రిజిస్ట్రార్ కలిశారని, ఇది ఈసీ ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు నామినేషన్లను అడ్డుకునేందుకు వైకాపా ప్రభుత్వం కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు.
మంత్రి పెద్దిరెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ ఏకే వేణుగోపాల్‌రెడ్డిపై.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు - ద్రవిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏకే వేణుగోపాల్‌రెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్రవిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏకే వేణుగోపాల్‌రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నిర్వహించిన సభలో మంత్రి పెద్దిరెడ్డిని రిజిస్ట్రార్ కలిశారని, ఇది ఈసీ ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
TDP
ఇదీ చదవండి:ఆసక్తి రేపుతున్న కుప్పం పురపాలక ఎన్నికలు