ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KCR Delhi Tour: ప్రత్యేక విమానంలో దిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్ - CM KCR Delhi Tour schedule

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​..దిల్లీ పర్యటనకు బయల్దేరారు. శనివారం కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​తో సమావేశమై..కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేసీఆర్​ చర్చించనున్నారు. ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో కేసీఆర్​ పాల్గొంటారు.

ప్రత్యేక విమానంలో దిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్
ప్రత్యేక విమానంలో దిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్

By

Published : Sep 24, 2021, 5:23 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​..దిల్లీ పర్యటనకు బయల్దేరారు. శాసనసభ సమావేశం, బీఏసీ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ హస్తినకు పయనమయ్యారు.

ఏ ఏ సమావేశాల్లో పాల్గొంటారంటే...

శనివారం.. కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేసీఆర్​ చర్చిస్తారు.

ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్​ పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చిస్తారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​తో కేసీఆర్ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించనున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

ఇదీ చదవండి

రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details