ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహాత్మునికి, లాల్​ బహదూర్​ శాస్త్రికి సీఎం జగన్, చంద్రబాబు నివాళులు

మహాత్మా గాంధీ, లాల్​ బహదూర్​ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు నివాళులర్పించారు. మహానేతలు చూపించిన మార్గంలో యువత నడవాలని వారు సూచించారు.

cm jagana, chandrababu
cm jagana, chandrababu

By

Published : Oct 2, 2021, 10:27 AM IST

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి రాష్ట్రంలో అడుగులు పడ్డాయని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రెండేళ్ల క్రితమే మహాత్ముడు సూచించిన మార్గంలో రాష్ట్రం ముందుకెళుతోందని తెలిపారు. రాష్ట్రంలో నేటి నుంచి 'క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌'కు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు.

గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. సంపూర్ణ సమైక్య జాతి నిర్మాణం, రాజకీయాల్లో నైతికతను గాంధీ ఆశించారని అన్నారు. నీతి శాస్త్రం వంటి లాల్‌ బహదూర్‌ శాస్త్రి జీవిత చరిత్రను మననం చేసుకుందామన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉండడమే శాస్త్రిని విశిష్ట వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details