ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు విజయవాడ జీజీహెచ్​కు సీఎం జగన్

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలోని జీజీహెచ్​లో ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను పరిశీలిచేందుకు ముఖ్యమంత్రి జగన్​ శనివారం ఆసుపత్రికి రానున్నారు.

cm jagan
cm jagan

By

Published : Jan 15, 2021, 8:33 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. వైద్యారోగ్య సిబ్బందికి తొలివిడతలో కొవిడ్ టీకా వేయనున్నారు. విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనూ దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​ విధానంలో ప్రారంభించనున్నారు. అనంతరం విజయవాడ జీజీహెచ్​లోని ఒకరిద్దరు వైద్య సిబ్బందితోనూ పీఎం మాట్లాడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పరిశీలించేందుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి రానున్నారు. ప్రధాని ప్రసంగం అనంతరం వైద్యారోగ్య సిబ్బందితో సీఎం మాట్లాడనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్​తో పాటు అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటేషన్ విభాగంలో పనిచేసే మహిళకు తొలి టీకా వేయాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details