ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Review: ఇప్పుడేం చేద్దాం?.. హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష - హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికారులు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై నేతలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను సీఎం తీసుకున్నారు. రాజధానిపై ఎలా ముందడుగు వేయాలనే అంశమై సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.

హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష
హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష

By

Published : Mar 3, 2022, 4:24 PM IST

Updated : Mar 4, 2022, 4:20 AM IST

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్... మంత్రులు బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఏజీ శ్రీరామ్, అదనపు ఏజీలతో సమీక్ష నిర్వహించారు. అయితే భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వ వైఖరిపై పూర్తి స్పష్టత రాలేదు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలనుకుంటే మూడు నెలల్లోగా పిటిషన్ దాఖలు చేయాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లబోమని బొత్స తెలిపారు. అయితే 3 రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కానీ హైకోర్టు తీర్పు తరువాత మూడు రాజధానుల పై ప్రభుత్వం ఎలాంటి అడుగు వేయాలన్నా....సుప్రీం కోర్టుకు వెళ్లి వెసులుబాటు తెచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో హైకోర్టు తీర్పును అమలు చేయడం తప్ప ప్రభుత్వానిక మరో మార్గం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.

హైకోర్టు చెప్పిన గడువులోగా పనులు పూర్తి చేయాలంటే...

రైతులతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న 9.14 ఒప్పందం ప్రకారం వారికిచ్చిన హామీల అమలుపై హైకోర్టు గడువులు నిర్దేశించింది. నెల లోపు మౌలిక వసతులు, మూడు నెలల్లోపు ఎల్‌పీఎస్‌ లే అవుట్‌లు అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లు కేటాయించాలని, రాజధాని నగర నిర్మాణం, సీఆర్‌డీఏ ప్రాంత అభివృద్ధిని ఆరు నెలల్లోపు పూర్తిచేయాలని, అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని హైకోర్టు ప్రభు‌త్వాన్ని ఆదేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు చెప్పిన గడువులోగా పనులు పూర్తి చేయాలంటే సీఆర్‌డీఏ తక్షణం రంగంలోకి దిగాలి. రాజధానిలో గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన రోడ్లు, వంతెనల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక వసతుల పనులతో పాటు ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలంటే వెంటనే పనులు పునరుద్ధరించేలా గుత్తేదారులతో ప్రభుత్వం అంగీకారానికి రావాలి. అయితే అప్పట్లో చేసిన పనులకే కొంతమందికి ఇంకా బిల్లులు చెల్లించలేదు.ఆ బకాయిలు ఇవ్వకుండా పనులు చేపట్టేందుకు ముందుకు వస్తారా అన్నది సందేహమే.


ప్రభుత్వం ముందున్న మరో సమస్య...

ప్రభుత్వం ముందున్న మరో సమస్య... నిధుల సమీకరణ. బ్యాంకులు, హడ్కో వంటి సంస్థలు రుణం ఇస్తే తప్ప ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా నిధులు సమీకరిస్తుందన్నది మరో పెద్ద ప్రశ్న. మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తెచ్చిన తరువాత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను మార్చేందుకు ప్రయత్నించింది. రాజధాని వెలుపల ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అమరావతిలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకుంది. అమరావతి మౌలిక వసతుల పనుల్ని కుదించి, సుమారు 11 వేల కోట్ల రూపాయలతో సరిపెట్టే ఆలోచన చేసింది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో ఇక ఎలాంటి మార్పులు చేయలేదు. రాజధాని భూముల్ని విక్రయించి, తనఖా పెట్టి అప్పులుతెచ్చి ఇతర అవసరాలకు వినియోగించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి, హైదరాబాద్‌ల నుంచి కొన్ని కార్యాలయాల్ని సైతం కర్నూలుకు తరలించింది. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కర్నూలుకు తరలించిన కార్యాలయాలు మళ్లీ వెనక్కి తిరిగి వస్తాయా...? అనే సందిగ్ధం నెలకొంది.

ఇదీ చదవండి

High Court Verdict on Amaravati: సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి: హైకోర్టు

Last Updated : Mar 4, 2022, 4:20 AM IST

ABOUT THE AUTHOR

...view details