బ్లాక్ ఫంగస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇంజక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
వైట్, ఎల్లో ఫంగస్‌పైనా అప్రమత్తం కావాలి: సీఎం జగన్ - కరోనాపై సీఎం జగన్ సమీక్ష న్యూస్
కరోనా నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లపైనా సమాచారం వస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. వాటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపైనా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెంటనే విశాఖపట్నం వెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. దీంతో ఆదిత్యనాథ్ దాస్ వెంటనే విశాఖ వెళ్లారు.
ఇదీ చదవండి:హైవే కిల్లర్ మున్నా కేసులో సంచలన తీర్పు.. 'నైలాన్ తాడుతో గొంతులు కోసేవాడు'