‘నా మంత్రివర్గాన్ని మార్చుకుంటున్నా.. ఈ నెల 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించండి’ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం జగన్ కోరినట్లు తెలిసింది. బుధవారం సీఎం జగన్.. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మంత్రిమండలి మార్పులు చేర్పులపై నివేదించారు. ప్రస్తుత మంత్రుల్లో ఎంత మందిని మారుస్తున్నదీ వివరించారు. గురువారం జరిగే మంత్రిమండలి సమావేశం తర్వాత ఆయా మంత్రుల రాజీనామా కోరనున్నట్లు గవర్నర్‌కు సీఎం తెలిపి.. ఆ మేరకు మంత్రుల రాజీనామాలను ఆమోదించాలని కోరినట్లు తెలిసింది.
'నా మంత్రివర్గాన్ని మార్చుకుంటున్నా.. పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించండి' - గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ
Cm jagan Meet Governor: గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాజ్ భవన్లో 45 నిమిషాల పాటు సాగిన భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గవర్న్‌తో జగన్ చర్చించినట్లు తెలిసింది. 'నా మంత్రివర్గాన్ని మార్చుకుంటున్నా.. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి అనుమతించండి' అని సీఎం జగన్ కోరినట్లు సమాచారం.
కాసేపట్లో గవర్నర్‌తో సీఎం భేటీ
తర్వాత కొత్తగా మంత్రిమండలిలోకి తీసుకుంటున్న వారి జాబితాను సమర్పిస్తామని.. వాటిని ఆమోదించి వారితో 11న ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత సీఎం.. గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి కావడంతో కొత్త జిల్లాల వివరాలనూ జగన్ వివరించినట్లు తెలిసింది. అరగంటకుపైగా సాగిన ఈ భేటీలో ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి ఆదాయార్జన ఎంత కష్టమో అందరికీ తెలుసు: మంత్రి బుగ్గన
Last Updated : Apr 7, 2022, 4:22 AM IST