CM MEETING: పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు క్రియాశీలకంగా పని చేయాలని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సూచించారు. కేటాయించిన ప్రాంతాల్లో సమన్వయకర్తలు పర్యటించాలని సీఎం తెలిపారు. నెలకు 6 సచివాలయాల్లో గడపగడపకు కార్యక్రమం నిర్వహించాలని.. కార్యక్రమాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. పనుల కోసం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తామన్న ముఖ్యమంత్రి.. నెలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.1.2 కోట్లు కేటాయిస్తున్నట్లు జగన్ తెలిపారు.
CM MEETING: మరింత బాధ్యతగా పని చేయాలి: జగన్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
CM MEETING: నెలకు 6 సచివాలయాల్లో గడప గడప కార్యక్రమం నిర్వహించాలని... కార్యక్రమాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్ సూచించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎలా ముందుకెళ్లాలో దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
CM MEETING
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్.. వాటిపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: