ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దగాపడిన రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం : సీఎం జగన్

దేశం కోసం, రాష్ట్రం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేశారని... సీఎం జగన్  గుర్తు చేసుకున్నారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సీఎం సన్మానించారు.

By

Published : Nov 2, 2019, 6:11 AM IST

Published : Nov 2, 2019, 6:11 AM IST

Updated : Nov 2, 2019, 8:04 AM IST

దగాపడిన రాష్ట్రాన్ని పునర్నిర్శిద్దాం : సీఎం జగన్

దగాపడిన రాష్ట్రాన్ని పునర్నిర్శిద్దాం : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతుందని ఎప్పుడూ ఊహించలేదని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయామని... దగా పడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు . పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టిశ్రీరాములు వంటి మహనీయుల వారసులను సీఎం జగన్ సన్మానించారు. సన్మానంపై పొట్టి శ్రీరాములు మనుమరాలు ఆచార్య రేవతి ఆనందం వ్యక్తం చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని సీఎం అన్నారు. నవరత్నాలను అమలు చేసి పేదల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్​ను సీఎం సందర్శించారు. సురభి నాటక కళా ప్రదర్శనను వీక్షించి కళాకారులను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్​కు చరిత్రలో ఉన్నత స్థానం ఉందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది మహానుభావులు పాల్గొన్నారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చేలా ఇందిరాగాంధీ మైదానంలో ఆయన ఫొటోలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి :

ఏ రాష్ట్రమూ.. ఇంత దగా పడలేదు: సీఎం జగన్‌

Last Updated : Nov 2, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details