'స్పందన'పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - కలెక్టర్లు
స్పందన కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు జగన్ అభినందనలు తెలిపారు.
cm-conference-with-officers-on-spandana-programme
'స్పందన' కార్యక్రమంలో సమస్యల పరిష్కార పురోగతిపై కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. వినతులు ఇస్తే పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని కలిగించారని జగన్ స్పష్టం చేశారు. జులై 12 వరకు 59 శాతం సమస్యలు ఉంటే.. జులై 19 నాటికి 24 శాతానికి తగ్గాయని తెలిపారు. కార్యాలయాలు, పోలీసుస్టేషన్లలో ఎక్కడా అవినీతి కనిపించకూడదని అధికారులకు సీఎం సూచించారు.