నిర్దిష్టమైన ప్రణాళికతో చదివితే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చని ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు అన్నారు. సివిల్స్ 2018లో మంచి ర్యాంకులు సాధించిన తెలుగు తేజాల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడలోని శరత్ చంద్ర అకాడమీలో జరిగిన కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి , ఆర్ ఆండ్ బీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రామసుబ్బారావు, గుంటూరు డివిజనల్ ఇంజనీర్ ఐఆర్ఎస్ ఈ విజయకీర్తి హాజరయ్యారు.
425వ ర్యాంకు సాధించిన సవిటి సాయి మురళి, 524వ ర్యాంకు తాడికొండ సవీశ్ వర్మ, 570 ర్యాంకు సాధించిన అనుముల శ్రీకర్ను సన్మానించారు. సివిల్స్ కు చదివే వారికి తమ అనుభవాలు వివరించారు.
'సాధించాలనే పట్టుదల ఉంటే... సివిల్స్ మీ వెంటే' - vijayawada
తపన ఉంటే సివిల్స్ ర్యాంకు కచ్చితంగా సాధించవచ్చని తెలుగుతేజం.. ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు తెలిపారు.
సివిల్స్ ర్యాంకర్లకు సన్మానం
ఇవి కూడా చదవండి.
Last Updated : Apr 28, 2019, 8:42 AM IST