గుంటూరులో పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయటం సిగ్గుచేటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పాత వాహనాలకు పార్టీ రంగులు వేసి షీ టీమ్ లకు స్వయంగా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అందజేయడం.. అధికార పార్టీకీ పోలీసులు తొత్తులుగా వ్యవహరించటమేనని దుయ్యబట్టారు. సీఎం జగన్ పుట్టినరోజు నాడే ఆ వాహనాలను అందించి అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజా రక్షణలో చిత్తశుద్ధి చూపాల్సిన పోలీసు యంత్రాంగం.. పార్టీ కార్యకర్తలుగా మారటం దురదృష్టకరమని చినరాజప్ప ధ్వజమెత్తారు.
పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయడమేంటి?: చినరాజప్ప - గుంటూరులో పోలీసు వాహనాలకు వైసీపీ రంగులు న్యూస్
పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయడంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప తప్పుబట్టారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడమేంటని మండిపడ్డారు.
పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయడమేంటి?: చినరాజప్ప