వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా... ప్రభుత్వం ఇప్పటి వరకు హంతకులు ఎవరనేది తేల్చలేకపోయిందని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న హత్యకు గురైతే...ఆ కేసును ఇప్పటివరకు పరిష్కరించకపోవటం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణ జరిపించాలని కోరిన జగన్...ఇప్పుడేందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వివేకాను హత్య చేసింది ఎవరో... ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టే కేసు నత్తనడకన సాగుతోందని ఆరోపించారు.
'వివేకాను హత్య చేసిందెవరో ముఖ్యమంత్రికి తెలుసు' - jagan
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రభుత్వం ఇప్పటివరకూ...ఎలాంటి పురోగతి సాధించకపోవటంపై తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. హత్యే చేసింది ఎవరో ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టే కేసు నత్తనడకన సాగుతోందని ఆరోపించారు.
తెదేపా నేత వర్ల రామయ్య