తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు "జాతీయ వైద్యుల దినోత్సవం" సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కష్టకాలంలో వైద్యులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ... కరోనా బాధితులకు డాక్టర్లు సేవలు చేస్తున్నారని, వృత్తి ధర్మం పట్ల అంకితభావంతో రాత్రింబవళ్లు రోగులను కాపాడేందుకు శ్రమిస్తున్నారని ప్రశంసించారు.
వైద్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లకు కనీసం రక్షణ పరికరాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.