ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో సామాన్యులపై లాఠీచార్జ్​ను ఖండించిన చంద్రబాబు - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తితిదే ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోందని.. తెదేపా అధినేత ఆక్షేపించారు. తిరుమల స్వామి వారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులపై లాఠీఛార్జీ చేయటం హేయమైన చర్యని మండిపడ్డారు.

chandrababu tweets about tirumala lotty charge on common people
తిరుమలలో సామాన్యులపై లాఠీచార్జ్​ను ఖండిస్తూ చంద్రబాబు ట్వీట్

By

Published : Dec 23, 2020, 7:37 PM IST

తిరుమల స్వామి వారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులపై లాఠీఛార్జీ చేయటం హేయమైన చర్యని.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తితిదే ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైకాపా శ్రేణులు తిరుమల కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ, డ్రోన్లు ఎగురవేస్తుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. స్వామి వారిని దర్శించుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందనే విషయం గుర్తించాలని హితవు పలికారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి భక్తులను దర్శనానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

తిరుమలలో సామాన్యులపై లాఠీచార్జ్​ను ఖండిస్తూ చంద్రబాబు ట్వీట్
తిరుమలలో సామాన్యులపై లాఠీచార్జ్​ను ఖండిస్తూ చంద్రబాబు ట్వీట్
తిరుమలలో సామాన్యులపై లాఠీచార్జ్​ను ఖండిస్తూ చంద్రబాబు ట్వీట్

ABOUT THE AUTHOR

...view details