CBN REVIEW MEETING పార్టీలో సీనియారిటీ, సమీకరణాల పేర్లతో టిక్కెట్లు వస్తాయనుకోవద్దని నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. రివ్యూలకు వచ్చిన వారందరికీ టిక్కెట్లు ఖాయమైనట్లేనని జరుగుతోన్న ప్రచారం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. నేతల పనితీరుపై ప్రతి మూడు నెలలకొసారి సమీక్ష చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. గత మూడు రోజుల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి.. వారి పనితీరును సమీక్షించారు. సీట్ల కేటాయింపులో పని తీరే ప్రామాణికమని నేతలకు స్పష్టం చేశారు. గెలిచే వారికే టిక్కెట్లని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో ఇదే తరహా సమీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సీట్ల కేటాయింపులో పనితీరే ప్రామాణికం, గెలిచే వారికే టికెట్లని తేల్చి చెప్పిన చంద్రబాబు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
CBN REVIEW MEET WITH INCHARGES నేతల పనితీరును దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నేతలకు చంద్రబాబు తేల్చిచెప్పారు. పార్టీలో సీనియారిటీ, సమీకరణాల పేర్లతో టిక్కెట్లు వస్తాయనుకోవద్దని నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు స్పష్టం చేశారు.
CBN REVIEW MEET WITH INCHARGES