వైకాపా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కరోనా వైరస్ కూడా తెదేపానే తెచ్చిందని వైకాపా నేతలు అంటారేమోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తెదేపాపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం పూర్తయితే 2 రాష్ట్రాలు భారత్-పాక్ అవుతాయని జగన్ దీక్షలు చేశారని.. అదే కాళేశ్వరం ప్రారంభానికి వెళ్లి టెంకాయ కొట్టివచ్చారని గుర్తు చేశారు. ఇద్దరూ కలిసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారన్నారు.
కరోనా కూడా తెదేపానే తెచ్చింది అంటారేమో: చంద్రబాబు - డాక్టర్ సుధాకర్ అరెస్టు న్యూస్
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. తనకు ఎవరైనా భయపడాలన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఫ్యాక్షనిజం, కుట్రలు, దోపిడీలు, దుష్ప్రచారాలు జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబు విమర్శించారు. పేదల అసైన్డ్ భూములను ఇష్టారాజ్యంగా లాక్కున్నారని.. ఇళ్ల పట్టాల ముసుగులో భారీ భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జగన్‌కు చట్టంపై గౌరవం లేదు, రాజ్యాంగంపై విశ్వాసం లేదని తెదేపా అధినేత మండిపడ్డారు. మాస్క్‌లు అడిగిన వైద్యుడిని సస్పెండ్ చేసి.. పిచ్చోడు అని ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులను లాఠీలతో కొట్టిస్తారు, మళ్లీ వాళ్లే మానవత్వం చూపాలంటారని చంద్రబాబు విమర్శించారు.
ఇదీ చదవండి: పాపతో పని చేయించడం... వారికి పాపమని అనిపించలే..!