ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నిరంకుశత్వంతో ప్రజలను బాధిస్తోంది: చంద్రబాబు - జగన్​పై చంద్రబాబు కామెంట్స్

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని హింసాత్మకంగా మార్చి నిరంకుశత్వంతో ప్రజలను బాధిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ట్రాక్ మీద చెల్లాచెదురుగా పడి ఉన్న అబ్దుల్ సలాం, అతని కుటుంబ సభ్యుల మృతదేహాలు చూసి రాష్ట్ర ప్రజలందరి హృదయాలు కలిచివేశాయని సంబంధిత వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

వైకాపా నిరంకుశత్వంతో ప్రజలను బాధిస్తోంది: చంద్రబాబు
వైకాపా నిరంకుశత్వంతో ప్రజలను బాధిస్తోంది: చంద్రబాబు

By

Published : Nov 11, 2020, 7:55 PM IST

క్రూరత్వం, అణచివేత ధోరణితో పోలీసులు సలాం కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించారని చంద్రబాబు మండిపడ్డారు. మానవత్వ విలువలను మంట కలిపి సలాం​ని దొంగతనం కేసులో ఇరికించారని.. తాను ఈ దొంగతనం చెయ్యలేదంటూ తీసిన సెల్ఫీ వీడియోలో అతని నిజాయితీ, అమాయకత్వం మనకి గుర్తుండిపోతాయన్నారు. దురదృష్టవశాత్తు ఇది ఒకటే సంఘటన కాదన్న ఆయన... అధికారులకు శిక్ష పడుతుందనే భయం లేకుండా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. నిస్సహాయస్థితిలో బాధితులవుతున్న ప్రజల పట్ల ఈ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ఈ నిరంకుశ ప్రభుత్వం చేసే తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details