ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య దిగ్భ్రాంతికి గురి చేసింది: చంద్రబాబు

By

Published : Feb 27, 2021, 9:54 PM IST

రాష్ట్రంలో బెట్టింగులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. బెట్టింగ్ మోజులో పడి కుప్పంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య దిగ్భ్రాంతికి గురి చేసింది
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య దిగ్భ్రాంతికి గురి చేసింది

కుప్పంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య దిగ్భ్రాంతికి గురి చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని.. బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చంద్రబాబు సూచించారు. బెట్టింగులు అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ చర్యలు కలవరపెడుతున్నాయి..

నెల్లూరు జిల్లాలో ఒక కూతురి వైద్యం కోసం మరో కూతుర్ని అమ్మకానికి పెట్టడం బాధాకరమని చంద్రబాబు వాపోయారు. వైద్య ఖర్చులకు 12ఏళ్ల బాలికను అమ్మేందుకు తల్లిదండ్రులు సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ చర్యలు కలవరపెడుతున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పేదలకు కాక మరెవరికని ప్రశ్నించిన ఆయన..సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.

ఇదీచదవండి

ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్..ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details