ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ పోలీసులు.. వైకాపా పాలనలో దిగజారిపోతున్నారు: చంద్రబాబు - ఏపీ తాజా వార్తలు

CBN ON AP POLICE: దేశంలోనే ఒకప్పుడు పేరున్న ఏపీ పోలీసులు.. వైకాపా ప్రభుత్వంలో రోజురోజుకూ దిగజారి పోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ.. కుప్పంలో చేపట్టిన నిరసనల సందర్భంగా దేశాన్ని కాల్చండంటూ..ఒక సీఐ వ్యాఖ్యలు చేయడాన్ని డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరన్నారు.

CBN ON AP POLICE
CBN ON AP POLICE

By

Published : Aug 7, 2022, 12:25 PM IST

CBN ON AP POLICE: దేశంలోనే ఒకప్పుడు పేరున్న ఏపీ పోలీసులు.. వైకాపా ప్రభుత్వంలో రోజురోజుకూ దిగజారి పోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొందరి తీరు.. పోలీసు శాఖకే తలవంపులు తెచ్చిపెడుతోందని మండిపడ్డారు. తప్పుచేసిన వారిని సమర్థించే నీచస్థాయికి కొందరు వెళ్లడం దారుణమన్నారు. వైకాపా ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ.. కుప్పంలో చేపట్టిన నిరసనల సందర్భంగా దేశాన్ని కాల్చండంటూ..ఒక సీఐ వ్యాఖ్యలు చేయడాన్ని డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరన్నారు. నిందితులకు బహిరంగంగా పోలీసులు మద్దతు పలకడమే కాకుండా, నిరసనలు చేపట్టిన తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు. తమపై తప్పుడు కేసులు మాని బరితెగించిన అధికారులను అదుపులో పెట్టి పోలీసుశాఖ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందన్నారు.

అసలేం జరిగిందంటే:ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కుప్పంలో తెదేపా నాయకులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్‌ సీఐ శ్రీధర్‌.. ‘దిష్టిబొమ్మనెందుకు.. దేశాన్ని కాల్చండి...’ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు తెదేపా శ్రేణులు యత్నిస్తుండగా సీఐ శ్రీధర్‌ అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎలా దహనం చేస్తారంటూ దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. ఈ క్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు పీఏ మనోహర్‌, అర్బన్‌ సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘మహిళతో తప్పుగా ప్రవర్తించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టాం. అలాంటి వ్యక్తి దిష్టిబొమ్మ దహనం చేస్తే తప్పేంటి. ఎంపీ మీ స్నేహితుడని అడ్డుకుంటున్నారా..’ అని మనోహర్‌ ప్రశ్నించారు. దీనిపై సీఐ శ్రీధర్‌ స్పందిస్తూ.. ‘ఇలా చేసే వారు చాలామంది ఉంటారు.. మీరు చేయలేదా.. దీని కోసం దిష్టిబొమ్మ దహనం చేస్తారా.. అతను నా స్నేహితుడని కాదు.. ఇది నా బాధ్యతగా అడ్డుకున్నా.. తప్పు తేలితే రాజ్యాంగపరంగా శిక్ష ఉంటుంది.. తప్పులు చేస్తే దిష్టిబొమ్మను కాలుస్తారా.. దిష్టిబొమ్మనెందుకు దేశాన్ని కాల్చండి....’ అంటూ వ్యాఖ్యానిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details