ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రేమ, ఆదరణే క్రీస్తు తత్వం: చంద్రబాబు

సమాజంలో శాంతి, సహనం లోపించటం క్రీస్తు మార్గానికి వ్యతిరేకమని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యనించారు. తెలుగు ప్రజలతోపాటు..,దేశ విదేశాల్లోని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన...హింసా విధ్వంసాలకు పాల్పడేవాళ్లు క్రీస్తు కృపకు పాత్రులు కాలేరన్నారు.

'హింసా విధ్వంసాలకు పాల్పడేవాళ్లు క్రీస్తు కృపకు పాత్రులు కాలేరు'
'హింసా విధ్వంసాలకు పాల్పడేవాళ్లు క్రీస్తు కృపకు పాత్రులు కాలేరు'

By

Published : Dec 25, 2020, 4:18 AM IST

తెలుగు ప్రజలతోపాటు..,దేశ విదేశాల్లోని క్రైస్తవులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సహనం లోపించటం క్రీస్తు మార్గానికి వ్యతిరేకమన్నారు. హింసా విధ్వంసాలకు పాల్పడేవాళ్లు క్రీస్తు కృపకు పాత్రులు కాలేరని తెలిపారు. రాష్ట్రంలో గత 19 నెలలుగా ఎస్సీలపై దమనకాండ జరగుతుండటం శోచనీయమని ఆక్షేపించారు. బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు పేట్రేగిపోవడం దురదృష్టకరమన్నారు. క్రైస్తవుల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా 38 ఏళ్లగా కృషి చేస్తే..,వైకాపా అధికారంలోకి వచ్చాక క్రిస్మస్ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, బీమా పథకాలన్ని నిలిపేసిందని విమర్శించారు.

తెదేపా హయాంలో 250 కోట్ల బడ్జెట్​తో క్రైస్తవుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. కరుణామయుడు, లోక రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రపంచ మానవాళి శ్రేయస్సును కాంక్షించారన్నారు. కరుణ, దయ, శాంతి, సహనం, ప్రేమ, సోదరభావం కలిగి ఉంటూ పొరుగువారిని ప్రేమించి ఆదరించడమే క్రీస్తు తత్వమని వివరించారు. అసూయ, ద్వేషాలు, కక్షా కార్పణ్యాలకు ఇందులో తావు లేదని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details