ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cbn: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం - కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పై చంద్రబాబు ఆగ్రహం

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మండిపడ్డారు.

చంద్రబాబు ఆగ్రహం
చంద్రబాబు ఆగ్రహం

By

Published : Nov 23, 2021, 2:03 PM IST

CBN: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మండిపడ్డారు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ధ్వజమెత్తారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్​ఈసీ, డీజీపీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికార పార్టీ వారిని చైర్మన్ గా నియమించుకోవాలని దుయ్యబట్టారు. భయభ్రాంతులకు గురిచేసి తెదేపా సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని వ్యక్తులు మారణాయుధాలతో హల్ చల్ చేస్తున్నా... పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు. ఎంపీ నానితో సహా తెదేపా సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తమ సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దని హెచ్చరించారు. కొండపల్లి చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details