కొవిన్ పోర్టల్.. భవిష్యత్‌లో అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చిన్నారులు, గర్భిణులకు వేస్తున్న పది రకాల టీకా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తున్నా.. కొవిన్ పోర్టల్ అంత సమగ్రంగా లేవు. దేశంలో విడతలవారీగా చేపట్టిన కొవిడ్ టీకా 'డ్రై రన్' సందర్భంగా ఎదురైన అనుభవాలతో కేంద్రం దీన్ని ఆధునికీకరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి.. ఫార్మా కంపెనీలో ఔషధం తయారీ నుంచి రాష్ట్రాలకు తరలింపు, కోల్డ్‌ఛైన్ పాయింట్లలో నిల్వ, గ్రామాల్లో పంపిణీ కేంద్రాలకు చేర్చడం, ప్రజలకు వేయడం వరకూ ప్రతి దశనూ ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు.
12 భాషల్లో సందేశాలు
కొవిడ్ పాజిటివ్‌గా తేలిన ప్రతి కేసూ అధికారికంగా నమోదయ్యేలా కొవిన్ పోర్టల్ రూపొందించారు. ఇప్పటికే నమూనాల పరీక్షలు, కేసులు, మరణాలు, కంటైన్‌మెంట్ జోన్ల వివరాలు ఇందులో పొందుపరుస్తున్నారు. తాజాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలోని 15 రకాల వివరాలూ నమోదు చేస్తారు. దీనిపై 700 జిల్లాల్లో సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చారు. తెలుగు, ఆంగ్లం, హిందీ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, పంజాబీ, ఒడిస్సా, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఛత్తీస్‌ఘరీ భాషల్లో సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు.
చాట్ బాక్స్ సౌకర్యం!
లబ్ధిదారులు టీకా కేంద్రాల్లో వివరాలు చెప్పేటప్పుడు ‘వాయిస్’ను బట్టి ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునేలా చాట్ బాక్స్ సౌకర్యం కల్పించారు. పేరు, వయసు, ఇతర వివరాలు చెబుతుంటే.. ‘టిక్’లు పడుతుంటాయి. తద్వారా టీకా కేంద్రంలో సమయం కలిసొస్తుంది.
మీట నొక్కగానే వివరాలు