ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బదిలీ.. సీఎం జగన్​ కేసులపై ప్రభావం..!

తెలంగాణ వ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా ఆయన నియమితులయ్యారు. కామారెడ్డి 9వ అదనపు జిల్లా జడ్జీగా ఉన్న సీహెచ్ రమేష్ బాబు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు.

CBI special court judge transferred it will Impact on AP CM Jagan cases
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బదిలీ

By

Published : Apr 30, 2022, 7:22 AM IST

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం.. సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన జడ్జీగా సీహెచ్ రమేశ్​ బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కామారెడ్డి 9వ అదనపు జిల్లా జడ్జిగా ఉన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు.. రాష్ట్ర వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్​పర్సన్​గా బదిలీ అయ్యారు. సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీతో ఏపీ సీఎం జగన్ కేసులపై ప్రభావం చూపనుంది.

మూడేళ్లకు పైగా జగన్ కేసులను సీబీఐ కోర్టు జడ్జిగా మధుసూదనరావు విచారణ చేపడుతున్నారు. జగన్ కేసులన్నీ ప్రస్తుతం డిశ్చార్జి పిటిషన్ల దశలోనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సీబీఐ తన వాదనలను వినిపించాల్సి ఉంది. ఈ దశలో న్యాయమూర్తి బదిలీ కావడంతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటి నుంచి చేయాలసిందేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ జడ్జీలు బదిలీ అయినప్పుడల్లా డిశ్చార్జి పిటిషన్ల విచారణ ప్రక్రియ మొదటికొస్తోంది. డిశ్చార్జి పిటిషన్లపై మళ్లీ మొదటికొస్తే జగన్ కేసు విచారణ ప్రక్రియ ఆలస్యం కానుంది.

సీబీఐ కోర్టు జడ్జితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా బి.పాపిరెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా సీహెచ్ కె. భూపతి, ఏసీబీ కోర్టు ప్రధాన జడ్జి గాజి.రాజగోపాల్ నియమితులయ్యారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details