'రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే అయోమయంలో ప్రజలు' - buddha venkanna latest news
రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా..? విజయసాయిరెడ్డా..? అనే అయోమయంలో ప్రజలు ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. తానే ముఖ్యమంత్రిని అన్న రీతిలో విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. విజయసాయిరెడ్డి ప్రవర్తనతో వైకాపా ఎంపీలూ విసుగెత్తిపోయారని ఆయన ఆరోపించారు.
విజయసాయిరెడ్డి తనకు ప్రతిరోజూ ఫోన్ చేయించి బెదిరిస్తున్నారని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి తప్ప... తప్పులు ఎత్తి చూపిస్తుంటే చంపేస్తామనే బెదిరింపులు తగవని హితవు పలికారు. బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కరోనా పరికరాల కొనుగోళ్లలోనూ చేతివాటం ప్రదర్శించారని ఆయన ఆక్షేపించారు. కులగజ్జి ఉన్నవారే ఎదుటివారి కులం గురించి పదేపదే మాట్లాడతారని మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేయించకపోవటం వల్లే రాష్ట్రంలో కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకిందని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు.