అవయవ దానం ఆవశ్యకత నానాటికీ పెరుగుతున్న తరుణంలో ఓ మహిళ పార్ధీవ దేహాన్ని వైద్య పరీక్షల కోసం వితరణ చేసి ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ.. విజయవాడలోని కుమార్తెల వద్ద ఉన్నారు. అనారోగ్యంతో మంగళవారం రాత్రి అన్నపూర్ణమ్మ మృతి చెందింది. మృతురాలి కుమార్తెలు... సమాజహితం కాంక్షిస్తూ తల్లి పార్ధీవ దేహాన్ని సిద్దార్ధ మెడికల్ కళాశాలకు వైద్య పరీక్షల కోసం దానం ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అన్నపూర్ణమ్మ నేత్రాలను సైతం సకాలంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి అందించి...మరో ఇద్దరికి చూపు కల్పించారు.
కుమార్తెల ఆదర్శం... తల్లి పార్థీవదేహం వెైద్య కళాశాలకు అప్పగింత... - body donation
తల్లి పార్థివ దేహాన్ని వైద్య కళాశాల విద్యార్థులు ప్రయోగాల కోసం దానం చేసి కుమార్తెలు ఆదర్శంగా నిలిచారు. మృతురాలి నేత్రాలు దానం చేసి... ఇద్దరికి చూపునిచ్చేలా చేసిన ఘటన విజయవాడలో జరిగింది.
తల్లి పార్థీవ దేహాన్ని వెైద్య కళాశాలకు దానమిచ్చిన కుమార్తెలు