ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపాకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు' - ముఖ్యమంత్రి  చంద్రబాబు

రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్ లో పెద్ద ఎత్తున తెదేపాకు వ్యతిరేకంగా ఓటు వేశారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు.

జీవీఎల్ నరసింహారావు

By

Published : Apr 13, 2019, 12:04 AM IST

జీవీఎల్ నరసింహారావు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరగు కానుందని .. ఆ స్థానాన్ని భాజపా భర్తీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. గురువారం జరిగిన పోలింగ్ లో రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తెదేపాకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం కనిపించిందన్నారు. తప్పుడు విమర్శలతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని చెప్పారు. ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ధన బలం, రౌడీయిజంతో గెలవాలని యత్నించాయని ఆరోపించారు. ఎన్నికలకు మరింత సమయం ఉండి ఉంటే.. భాజపాకు మంచి ఫలితాలు వచ్చేవని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details