AP BJP: నేడు కలెక్టరేట్ల ఎదుట భాజపా ధర్నా - వైకాపా ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ రేపు ఆందోళనలు
21:48 September 05
వైకాపా ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ నేడు ఆందోళనలు
వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే కరోనా నిబంధనలు అమలు చేస్తూ ఎదురుదాడికి దిగటం వైకాపా ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమని భాజపా మండిపడింది. మల్లాది విష్ణు ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని, సోము వీర్రాజుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించింది. వినాయక చవితికి పందిళ్లు వేసుకొని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలన్న డిమాండ్‌తో నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని భాజపా ప్రకటించింది. ఉదయం 11 గంటలనుంచి రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, సబ్‌కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపింది. కర్నూలులో సోము వీర్రాజు, సత్యకుమార్‌లను అరెస్టు చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
- వినాయకచవితి ఉత్సవాలపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సత్యరవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు
- bjp somu: హిందువుల వేడుకలపైనే ఆంక్షలెందుకు..?
- Janasena: కార్యకర్తలపై దాడులు చేస్తే నేనే రోడ్లపైకి వస్తా: పవన్ కల్యాణ్