ఊరువాడా, పల్లె పట్నం ఎక్కడా చూసిన గ్రామ, వార్డు సచివాలయాల గురించే చర్చ. ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ప్రభుత్వ పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టడంతో ఎలాగైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అర్హత ఉన్న అభ్యర్థులంతా పరీక్షకు సన్నద్ధమవడంపై దృష్టి సారిస్తున్నారు. నోటిఫికేషన్లో 3 కేటగిరి కింద 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి 7 పోస్టులు, వార్డు సచివాలయాలకు సంబంధించి 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో విద్యార్హత ఉండడం వల్ల ఈ కేటగిరిలో పోటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది.
వ్యవసాయ సంబంధిత విద్యలో డిప్లోమా లేదా నాలుగేళ్ల డిగ్రీ, బీఎస్సీ(బిజెడ్సి) విద్యార్హతతో ప్రస్తుతం ఎంపీఈవోలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. బీఎస్సీ బిజెడ్సి అర్హతతో ఎంపికైన వారు..ఆ తర్వాత రెండేళ్ల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా 6 వేల 714 గ్రామ వ్యవసాయ సహాయకులు భర్తీ చేయనున్నారు. ఉద్యానవన విద్యకు సంబంధించి డిప్లమా, డిగ్రీ, ఆపై అర్హతలు కలిగి ఉన్నవారు....గ్రామ ఉద్యానవన సహాయకుల పోస్టులకు అర్హలు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల ఉద్యానవన సహాయకులను నియమించనున్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతున్న మత్స్యశాఖకు సంబంధించి 794 గ్రామ మత్స్య సహాయకుల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు మత్స్యశాఖలో డిప్లమా లేదా డిగ్రీ ఉండాలి. బీఎస్సీ జువాలజీ విద్యార్హత కలిగి మత్స్యశాఖలో మల్టీపర్పస్ ఎక్స్ టెన్షన్ అసిస్టెంట్ MPEA గా విధులు నిర్వహిస్తున్న వారు సైతం ఈ పోస్టులకు అర్హులు.
పశు సంవర్థక శాఖలోనూ భారీగానే..
రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల 388 గ్రామ పశుసంవర్థక శాఖ సహాయకుల పోస్టులు భర్తీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పశు సంవర్థక విద్యలో పాలిటెక్నిక్ చేసిన వారితో పాటు డైయిరీ, పౌల్ట్రీలో ఒకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సులు చేసిన వారు ఈ పోస్టుకు అర్హులు.రాష్ట్రవ్యాప్తంగా 13వేల540 ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తున్నారు. పదో తరగతితో పాటు ఎంపీహెచ్ఏ కోర్సులు పూర్తి చేసి, రాష్ట్ర ఏఎన్ఎం, హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ లో సభ్యత్వం ఉండి, పారామెడికల్ బాడీలో సభ్యత్వం ఉన్నవాళ్లు ఏఎన్ఎం పోస్టులకు అర్హులు. పట్టుపురుగుల పెంపకంలో సేవలందించేందుకు గానూ గ్రామ సచివాలాయల్లో 400 గ్రామ పట్టుపురుగుల పెంపకం సహాయకులను నియమించనున్నారు.
మూడింటికి సైన్స్ డిగ్రీ
ఆ కోర్సులు చేసిన వారికి సువర్ణావకాశం! - big_opprunity_to_get_govt_job_who_completed_completed_agriculture_polytechnic
గ్రామ సచివాలయాల నియామక ప్రక్రియలో కేటగిరి 3 కింద వేర్వేరు విద్యార్హతలతో 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించి ప్రత్యేక విద్యార్హతలు పేర్కొనడంతో... ఈ విభాగానికి మిగిలిన వాటితో పోలిస్తే కాస్త పోటీ తక్కువనే చెప్పాలి. పట్టుపురుగులు, మత్స్య, ఉద్యానవనాల పెంపకం వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సచివాలయ నియామకాలు ఓ సువర్ణావకాశంలాంటిది.
కేటగిరి-3లో 11 వేల 158 డిజిటల్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తుండటంతో సంబంధిత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు, బీటెక్ పట్టభద్రులకు ఇదొక మంచి అవకాశం.ఇక కేటగిరి-3 కింద వార్డు సచివాలయాల్లో భర్తీ చేసే 4పోస్టులు మూడింటికి సైన్స్ డిగ్రీని ఒక విద్యార్హతగా పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పర్యావరణ కార్యదర్శి గ్రేడ్ 2 కింద 3వేల 648 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏదైనా సైన్స్ డిగ్రీ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. అలాగే 3వేల 770 వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టులు భర్తీ చేస్తుండగా....దీనికి సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసినవాళ్లు, ఆర్కిటెక్చర్ లో బ్యాచలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
కేటగిరి-3 కింద భర్తీ చేసే పోస్టుల్లో ఒక్కో పోస్టుకు ఒక్కో సిలబస్ ఇవ్వడంతో... ప్రశ్నపత్రం సైతం వేరువేరుగా ఇవ్వనున్నారు. రెండిటికీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రెండు కేటగిరీలకు వేరు వేరు సమయాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
TAGGED:
గ్రామ సచివాలయ ఉద్యోగాలు