ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

krishna ella: తాను చదువుకున్న కాలేజీకి ఫ్రీగా వ్యాక్సిన్​ - telangana latest news

భారత్ బయోటెక్ మేనేజింగ్​ డైరెక్టర్​ క్రిష్ణ ఎల్లా తన ఉదారతను చాటుకున్నారు. తాను చదువుకున్న కళాశాల, దాని అనుబంధ సంస్థలకు వ్యాక్సిన్​ అందించేందుకు ముందుకొచ్చారు. 4 వేల కొవాగ్జిన్​ డోసులు పంపిస్తానని మాటిచ్చారు.

కృష్ణా ఎల్లా
కృష్ణా ఎల్లా

By

Published : Jun 19, 2021, 8:14 PM IST

తాను చదువుకున్న కళాశాల, దాని అనుబంధ సంస్థలకు వ్యాక్సిన్ అందించేందుకు భారత్ బయోటెక్ మేనేజింగ్​ డైరెక్టర్​ క్రిష్ణఎల్లా ముందుకొచ్చారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న ఆనంద్ నికేతన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్​లో బీఎస్సీ పూర్తి చేసిన డా. క్రిష్ణఎల్లాకు.. అక్కడి వారితో ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. ఆనంద్ వన్ కళాశాల, దాని అనుబంధ సంస్థ ఆనంద్ వన్​లో నివాసితులకు వ్యాక్సిన్​ అందించేందుకు 4 వేల కొవాగ్జిన్ డోసులు పంపిస్తానని ఆయన మాటిచ్చారు. ఇప్పటికే 2 వేల డోసులను ఆనంద్ వన్​కు పంపగా.. ఇవాళ్టి నుంచి అక్కడి వారికి కొవాగ్జిన్ డోసు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

చంద్రపూర్ జిల్లా వరోరా పట్టణంలో నిరాదరణకు గురైన కుష్టు వ్యాధిగ్రస్తుల సంరక్షణ కోసం మెగసెసే అవార్డు గ్రహీత బాబా ఆమ్టే 1949లో మహా రోగి సేవాసమితి ఆధ్వర్యంలో ఆనంద్ వన్ చికిత్స, సంరక్షణాలయం ప్రారంభించారు. ఆనంద్ వన్ కేంద్రంలో ఇప్పుడు కుష్టు వ్యాధి బాధితులే కాక.. మూగ, చెవిటి, దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు, వితంతువులు, నిరుద్యోగులు ఎందరికో ఆశ్రయం కల్పిస్తోంది. మహా రోగి సేవా సంస్థల నుంచి విద్యాధికుడైన డా.క్రిష్ణ ఎల్లా తిరిగి సంస్థ సభ్యులకు వ్యాక్సినేషన్ అందించేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని.. ఆయనకు కృతజ్ఞతలని బాబా ఆమ్టే మనవడు కస్తుబా ఆమ్టే తెలిపారు.

ఇదీ చదవండి:

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 5,674 కరోనా కేసులు, 45 మరణాలు

ABOUT THE AUTHOR

...view details