అమరావతిలో సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ పాల్గొన్నారు. వీరితో పాటు మహిళా మంత్రులు పుష్ప శ్రీవాణి, తానేటి వనిత, మహిళా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ... సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాలు ముఖ్యంగా మహిళలు, చిన్నారులే లక్ష్యంగా జరుగుతున్నాయని అన్నారు. సైబర్ మోసాల నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. సైబర్ మోసాల బాధితులు నిర్లక్ష్యం వహించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతం 2 సెకన్ల వ్యవధిలో ఏ విషయమైనా స్మార్ట్ఫోన్లకు చేరిపోతుందని అన్నారు. సాంకేతికతతో ప్రయోజనాలు ఉన్నా.. అనర్థాలు పెరగడం ఆందోళనకరమన్నారు. బాధితులకు సత్వర న్యాయం కోసం ప్రతి ఒక్కరి సహకారం కావాలని సుచరిత కోరారు.సైబర్ మోసాల తీరు, బాధితులకు భరోసా వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ, పోలీస్ యంత్రాంగానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి - Be alert from cyber attacks: Homer
రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్‌లో 'సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ' అంశంపై సదస్సు జరిగింది. హోంమంత్రితో పాటు డీజీపీ, పలువురు మహిళ మంత్రులు పాల్గొన్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా మహిళలు జాగ్రత్తగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు.
సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: హోమంత్రి
సైబర్ నేరాలపై ప్రత్యేక ఫోన్ నంబర్..
సైబర్ నేరాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఫిర్యాదు కోసం సైబర్ మిత్ర పేరిట ఫేస్బుక్, వాట్సాప్ నెంబర్లను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు'9121211100' నంబర్‌ను కేటాయించారు.
Last Updated : Jul 26, 2019, 1:44 PM IST