ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ఉద్ధృతి పెరిగింది. నీరు ఎక్కువగా రావటంతో ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తేశారు. దిగువనున్న ముంపు ప్రాంత వాసులకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుందని.. ఇళ్లు ఖాళీ చేసి ఎగువ ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు.
మేం ఎక్కడికి వెళ్లాలి..?: ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదన - కృష్ణా జిల్లాపై వరద ప్రభావం తాజా వార్తలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తిన కారణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇలా వరదలు వచ్చినప్పుడల్లా తాము ఎక్కడికి వెళ్లాలని ముంపు ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదన
కృష్ణలంక దిగువప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. వరదలు వచ్చినప్పుడల్లా ఇళ్లు మునిగిపోయి సామగ్రి అంతా పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో పనుల్లేక అల్లాడుతున్నామని తమ గోడు చెప్పుకున్నారు. ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆర్థికసాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలదిగ్భందంలో లోతట్టు ప్రాంతాలు